e పలక, అంతర్జాలంలో తెలుగు వ్రాయుటకు మరో పరికరం

ముందుగా అందరికీ సంగ్రాంతి శుభాకాంక్షలు.

e పలక, అంతర్జాలంలో తెలుగు వ్రాయుటకు మరో పరికరం. నాగార్జునా వెన్నా గారు వ్రాసిన పద్మ ని కేంద్రంగా వాడుకుని, ఈ e పలక ను తయారు చేయటం జరిగింది.

ఇంజినీరింగ్ లో మినీ ప్రాజెక్ట్ లో భాగంగా చేసిన ఈ పలకనూ ఇన్నాళ్ళు నేనే వాడుకోగా, మురళీధర్ నామాల సలహా మేరకు ఒక కార్య రూపం చేకూర్చి ఈ డోమైన్(http://epalaka.com) అందు ఉంచాను.

ఇందులో ముఖ్య విషయాలకు వస్తే…

  1. input/output పక్కపక్కన ఉంచటం
  2. పెద్ద పెద్ద పేరాగ్రాఫులు మొత్తంగా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవటం.
  3. టైపు చేసుకున్న సందేశాన్ని గూగుల్, బింగ్ అందు వెతకటం.
  4. టైపు చేసుకున్న సందేశాన్ని నేరుగా ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యటం.
  5. టైపు చేసుకున్న సందేశాన్ని .txt format లో desktop లోకి సేవ్ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.

అంతే కాకుండా చిన్న editor ( still working ) ఉన్నాయి.

తెలుగులో బ్లాగర్లకు/ ఔత్సాహికులకు ఇది ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను.

మరొక్కసారి నాగార్జున వెన్నాగారికి  మురళీధర్ నామాల కు నా ధన్యవాదాలు

దయచేసి మీ సందేహాలు, బగ్గులు, సలహాలు తెలుపగలరు.

Comments

  1. చాలా బావుంది. ఫేస్బుక్, గూగుల్ ప్లస్ లకి కూడా ఇక్కడ్నించే పోస్ట్ చేసే సౌలభ్యం అందివ్వగలరేమో చూడండి. చాలా సౌకర్యంగా ఉంది. ఆ పక్కన రాస్తూ ఈ పక్కన చూసుకోవడం వల్ల నా లాంటి ఇర్రెగ్యులర్ యూసర్స్ కి సునాయసం గా ఉంది. ఇంగ్లీషుకి, తెలుగుకి సెలెక్ట్ చేసిన ఫాంట్ సైజ్ కూడా సమ తూకంగా ఉంది. పైకి కిందికి తిప్ప వలసిన అవసరం పెద్దగా లేకుండానే ఎక్కువ రాయగలం. నేను లేఖిని ఆఫ్ లైన్ ని నా సౌకర్యార్ధం ఎలా మార్చుకున్నానో దాని కన్నా ఇది బావుంది. ఇహ నుంచీ ఈ పలకే నా పలక.

    • అశ్విన్ :

      ధన్యవాదాలు,
      Facebook లో మొన్నటిదాకా ఆ సౌకర్యం ఉండేది, కానీ security వల్ల తీసేశాడు, Google+ API లో ఇంకా ఆసౌకర్యం లేదు, రాగానే వెంటనే Update చెస్తాను.
      మీకు నచ్చినట్టైతే మీ బ్లాగులో లంకె వెయ్యగలరు

  2. nanda kishore :

    మిత్రమా.. నేను బ్లాగుకి,బ్లాగులో రాసే రాతకి కొత్త.. లేఖినిని ఉపయోగించి రెండు రోజులు చూపుడువేలి నొప్పితోనూ,మెడ నొప్పితోనూ బాధపడితిని..ఈ పలకను అందించినందుకు కృతజ్ఞతలు.. :)

Speak Your Mind

*